అత్యాచారం కేసులో పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు వెలువరించిన వెంటనే పోలీసులు ఆయనను అదుపులోనికి తీసుకున్నారు. ఆయనను పంచకుల నుంచి హెలికాప్టర్ ద్వారా రోహతక్ జైలుకు తరలించారు. తీర్పు వెలవడిన అనంతరం హింసాకాండకు తెగబడిన దాదాపు 1000 మంది డేరా సచ్ఛా సౌదా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో కర్ఫ్యూ విధించారు. అలాగే ఢిల్లీలోనూ అల్లర్లు చెలరేగడంతో అక్కడా నిషేధాజ్ణలు విధించారు. యూపీలోని నొయిడా సహా పలు ప్రాంతాలలో 144వ సెక్షన్ విధించారు. పంజాబ్ రాష్ట్రానికి అదనపు బలగాలను పంపించారు