విశాఖపట్నం జిల్లాలలో 4 రోజుల పర్యటన ముగించుకుని భారత ఉప రాష్ట్రపతి ఎమ్. వెంకయ్య నాయుడు మంగళవారం ఉదయము గం. 9.20 ని. లకు ప్రత్యేక విమానములో బయలుదేరారు. వారికి విమానాశ్రయంలో ప్రజా ప్రతినిధులు,, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. విమానాశ్రయంలో వీడ్కోలు పలికిన వారిలో పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలక్టరు వి. వినయ్ చంద్, విశాఖపట్నం పోర్టు ట్రస్టు చైర్మన్ రామ మోహన్ రావు, నగర పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.