VIZAGVISION:Akshaya Patara Foundation & Vadik Science Club 10,000 Note Books Distributions,Visakhapatnam…వేదిక్ సైన్స్ క్లబ్ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మరియు గీతం యూనివర్సిటీ విద్యార్థులు ఏప్రిల్ 2017 సంవత్సరంలో వివిధ సంస్థలు మరియు ప్రజల నుంచి పాత పనికిరాని నోట్ బుక్స్ మరియు టెక్స్ట్ బుక్స్ 18 టన్నులు సేకరించడము జరిగినది. ఆవిధంగా సేకరించిన పాత పుస్తకాలను తిరిగి కొత్త నోటుపుస్తకాలుగా తయారు చేయగా 10000 కొత్త నోట్ బుక్స్ తయారు అయినవి. ఈ నోట్ బుక్స్ అక్షయ పాత్ర ద్వారా మధ్యాహ్నం భోజనం ఇచ్చుచున్న హై స్కూల్స్ నందు పతి స్టూడెంటుకు 5 బుక్స్ ప్రకారం ఈ సంత్సరము 2500 మంది విద్యార్థులకు ఇవ్వగలగుచున్నాము. పాత పుస్తకాలను సేకరించడంలో సహకరించిన పత్రికా ప్రతినిధులు మరియు విశాఖ పుర ప్రజలకు ఈ సందర్భంగా మా కృతఙ్ఞతలు తెలియ జేయు చున్నాము