HomeUncategorizedVizagvision సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలోని శిల్పాలు, శాసనాలకు యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న దేవస్థానం ఈఓ సూర్యకళ ఇవాళ … ఆంధ్రాయూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డిని కలిశారు. శిల్పకళలు, శాసనాలపై పూర్తిస్థాయిలో స్టీడీచేసేందుకు టెక్నికల్ సపోర్టివ్వాలని కోరారు. రామప్పను మించిన చారిత్రక శిల్పకళా సౌందర్యం సింహాచలం సొంతమంటూ డాక్యుమెంట్లు, పురాతన పుస్తకాలు, ఫొటోలను చూపిస్తూ ఆమె వివరించారు. 11వ శతాబ్దం నుంచి తరతరాల సంస్కృతికి అద్దంపట్టేవిధంగా శిల్పాలున్నాయని… శ్రీకృష్ణదేవరాయలు నుంచి గజపతుల వరకు రాజశాసనాలు చరిత్రకు అద్దంపడుతున్నాయని సూర్యకళ వివరించారు. ఇటీవలే అన్ని శిల్పాలను శుభ్రపరిచి… భక్తులకు అర్థమయ్యేలా బోర్డులుకూడా పెడుతున్నామన్నారు. అటు… శిల్పకళలు- శాసనాలను స్టీడీ చేసి అన్ని విషయాలనూ వెలుగులోకి తీసుకొచ్చేందుకు అన్ని రకాల టెక్నికల్, స్టక్చరల్ సపోర్టు అందిస్తామని ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి హామీనిచ్చారు. అంతేకాదు నిపుణులతో ఒక టీంను ఏర్పాటుచేస్తామన్నారాయన. సింహాచలం దేవస్థానపై పూర్తిస్తాయిలో పరిశోధన చేయిస్తామన్నారాయన. యునెస్కో వారసత్వసంపదగా గుర్తింపు పొందడానికి అన్ని అర్హతలూ సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. దేవస్థానంలో ఇటీవలే జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను సూర్యకళ … ఆయనకు వివరించారు. గిరి ప్రదక్షిణ సహా దేవాలయంలో జరుగుతున్న పూజలు, యాత్రికుల సదుపాయాల గురించి దేవస్థానం ఈఓ సూర్యకళ, వీసీ చర్చించుకున్నారు. త్వరలోనే ఏయూ రీసెర్చ్ టీం… శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామివారిని దర్శించి… పరిశోధన ప్రారంభించనుంది
Vizagvision సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలోని శిల్పాలు, శాసనాలకు యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న దేవస్థానం ఈఓ సూర్యకళ ఇవాళ … ఆంధ్రాయూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డిని కలిశారు. శిల్పకళలు, శాసనాలపై పూర్తిస్థాయిలో స్టీడీచేసేందుకు టెక్నికల్ సపోర్టివ్వాలని కోరారు. రామప్పను మించిన చారిత్రక శిల్పకళా సౌందర్యం సింహాచలం సొంతమంటూ డాక్యుమెంట్లు, పురాతన పుస్తకాలు, ఫొటోలను చూపిస్తూ ఆమె వివరించారు. 11వ శతాబ్దం నుంచి తరతరాల సంస్కృతికి అద్దంపట్టేవిధంగా శిల్పాలున్నాయని… శ్రీకృష్ణదేవరాయలు నుంచి గజపతుల వరకు రాజశాసనాలు చరిత్రకు అద్దంపడుతున్నాయని సూర్యకళ వివరించారు. ఇటీవలే అన్ని శిల్పాలను శుభ్రపరిచి… భక్తులకు అర్థమయ్యేలా బోర్డులుకూడా పెడుతున్నామన్నారు. అటు… శిల్పకళలు- శాసనాలను స్టీడీ చేసి అన్ని విషయాలనూ వెలుగులోకి తీసుకొచ్చేందుకు అన్ని రకాల టెక్నికల్, స్టక్చరల్ సపోర్టు అందిస్తామని ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి హామీనిచ్చారు. అంతేకాదు నిపుణులతో ఒక టీంను ఏర్పాటుచేస్తామన్నారాయన. సింహాచలం దేవస్థానపై పూర్తిస్తాయిలో పరిశోధన చేయిస్తామన్నారాయన. యునెస్కో వారసత్వసంపదగా గుర్తింపు పొందడానికి అన్ని అర్హతలూ సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. దేవస్థానంలో ఇటీవలే జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను సూర్యకళ … ఆయనకు వివరించారు. గిరి ప్రదక్షిణ సహా దేవాలయంలో జరుగుతున్న పూజలు, యాత్రికుల సదుపాయాల గురించి దేవస్థానం ఈఓ సూర్యకళ, వీసీ చర్చించుకున్నారు. త్వరలోనే ఏయూ రీసెర్చ్ టీం… శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామివారిని దర్శించి… పరిశోధన ప్రారంభించనుంది