VIZAGVISION:Oxgen Towers || 36Floors || at Sitammadara,Visakhapatnam..ఆకాశాన్ని తాకే భవంతులు అవి…..ఆక్సిజన్ టవర్స్ గా అందరి ద్రుష్టిని ఆకర్షిస్తున్నాయి….విశాఖ యావత్తూ తలెత్తుకునేలా…
36 అంతస్తుల్లో రూపుదిద్దుకున్న భారీనిర్మాణం అది…విశాఖలో ఏమూల వున్నా అవి దర్శనమిస్తాయి…..సీతమ్మధార ఎక్కడ వుంది
అని ఎవరైనా అడిగితే అదిగో ఆ కనిపిస్తున్న భవంతులు వున్నదే సీతమ్మధార అని ఇట్టే చెప్పేయవచ్చు…ఇక ఈ భవంతుల్లో నివాసం వుండబోయే వారు తమ చిరునామా ఎక్కడో తడుముకోకుండా చెప్పేవచ్చు….కానీ ఇక్కడకు చేరుకున్నాకే వారు
వుండే అంతస్తు.. ఇంటి నెంబర్ ను తెలుసుకోడానికి అత్యధిక సమయం వెచ్చించాల్సివుంటుంది…తమ ఇంటికి తాము వెళ్లడానికి
కొత్తలో ట్రైల్ రన్ వేసుకున్నా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు…
నాలుగు ఎకరాల విస్తీర్ణంలో విశాఖలో నిర్మించిబడ్డ అతిపెద్ద కట్టడం కూడా ఇదే…ఒక్కో అంతస్తు పైకి ఎక్కుతున్నకొలదీ…
నగరంలో వుండే రణగొణధ్వనుల నుంచి విముక్తి లభించడం మొదలవుతుంది….ఇక 36 అంతస్తుకు చేరేసరికి అలసట మాటెలావున్నా
అసలు ఎక్కడున్నామా అనే అనుమానం కలుగుతుంది….విశాఖ అందాలను బర్డ్స్ ఐ వ్యూ కోణంలో చూసే భాగ్యం మీకు కలుగుతుంది.
అయితే కళ్లు తిరగకుండా జాగ్రత్తపడే బాధ్యత ఎవరికి వారే తీసుకోవాలి మరి..
బహుళ అంతస్తుల సముదాయంలో నివాసముండే వారికి వుండే సౌకర్యాలు అన్నీ ఇన్నీకావు..బాడ్మింటన్ కోర్ట్,ఫలహారశాల,
కార్ వాష్, క్లబ్ హౌస్,గెస్ట్ హౌస్, వ్యాయామశాల,ఆరోగ్యకేంద్రం,హోమ్ థియేటర్,ఇండోర్ గేమ్స్,లైబ్రరీ, మల్టీపర్పస్ హాల్,పార్టీ ఏరియా, సీనియర్ సిటిజన్స్ పార్క్,స్విమ్మింగ్ పూల్ ఇలా చెప్పుకుంటూపోతే ఎక్కడికీ వెళ్లకుండానే సకల సౌకర్యాలు పొందవచ్చు..
ఇక ఈ భవంతుల్లో దిగడం ఒక స్టేటస్ సింబల్….ఇందులో నివసించబోయే వారు కనీసం బందువులో లేక స్నేహితులో అయినా బావుండేది…
ఈ వంకనైనా వారి ఇళ్లకు వెళ్లి ఈ అతిపెద్ద నిర్మాణాన్ని స్వయంగా చూసే భాగ్యం కులుగుతుందని ఎదురు చూసేవారు విశాఖలోని ప్రతికాలనీలో వున్నా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు..