బెంగుళూర్: మోదీ సర్కార్‌పై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రపంచ దేశాల్లో భారత్ స్థాయిని మోదీ ప్రభుత్వం ఇనుమడింపచేసిందని ప్రస్తుతించారు. దేశ భద్రత, రక్షణ విషయాల్లో దేశం ఎవరికీ తలవంచదని ప్రభుత్వం విస్పష్టంగా చాటిందని డోక్లాంఅంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించారు. మోదీ సర్కార్ చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్నీ ఆయన స్వాగతించారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రపంచ దేశాల్లో భారత్ స్థాయిని పెంచాయని. ప్రపంచమంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నదని చెప్పారు. మాందలోని ఓ కళాశాలలో దివంగత ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి స్మారక కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడారు.
స్వచ్ఛ భారత్‌కు మోదీ ప్రజల మద్దతు కూడగట్టడాన్ని 1965లో ఇండో-పాక్ యుద్ధానికి లాల్ బహుదూర్ శాస్ర్తి ప్రజాభిప్రాయాన్ని సమీకరించడంతో పోల్చారు.