సూపర్‌స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘రోబో’ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ ఇదే కాంబినేషన్లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం ‘2.0’. ఈ చిత్రాన్ని ఇండియన్ సినిమాలోనే భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో హాలీవుడ్ స్థాయిలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ తమ మొదటి చిత్రంగా ‘2.0’ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ విలన్‌గా ఓ విభిన్నమైన పాత్ర పోషిస్తుండగా, ఎమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. కాగా, ఈ చిత్రం ఆడియోను అక్టోబర్‌లో దుబాయ్‌లో విడుదల చేయనున్నారు. అలాగే నవంబర్‌లో టీజర్‌ను హైదరాబాద్‌లో రిలీజ్ చేస్తారు. డిసెంబర్లో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను చెన్నైలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు లైకా ప్రొడక్షన్స్ క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగం తెలిపారు. ఈ చిత్రాన్ని జనవరిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన ఎమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ విలన్‌గా ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో సుధాంశు పాండే, ఆదిల్ హుసేన్, కళాభవన్ షాజాన్, రియాజ్ ఖాన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ: నిరవ్‌షా,
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్,
ఎడిటింగ్: ఆంటోని,
సమర్పణ: సుభాష్ కరణ్,
లైకా ప్రొడక్షన్స్ క్రియేటివ్ హెడ్: రాజు మహాలింగం,
నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శంకర్.