Jana Sena Pawan Kalyan Teleconference with JSP Leaders Vizag vision #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/
Jana Sena Pawan Kalyan Teleconference with JSP Leaders Vizag vision
-
Previous
Vizagvision Visakhapatnam: గజల్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ తెలుగు సంబరాలలో భాగంగా “తెలుగు సాహిత్యంలో నవీన రీతులు ” (ప్రక్రియలు) అనే సదస్సుకు ఖమ్మంజిల్లా నివాసి నవరత్నాల ప్రక్రియ రూపకర్త శ్రీ రాణాప్రతాప్ గారు అధ్యక్షత వహించారు.జనరంజకంగా జరిగిన ఈ సదస్సులో విశాఖపట్టణ నివాసి, ఎలయన్స్ కళాశాల అధ్యాపకురాలు శ్రీమతి ఉమామహేశ్వరి యాళ్ళ గారు , ఖమ్మం జిల్లా నివాసి, తెలుగు అధ్యాపకులు, టిపిటిఎఫ్ పత్రికా సంపాదకులు అయిన ఎనగందుల దేవయ గారు సృష్టించిన నూతన కవితా ప్రక్రియ షాడోలను చక్కగా ఉదహరించి సభకి పరిచయం చేసారు. ఆమె ఉభయ రాష్టాలకి చెందిన వాట్సాప్ సమూహమునకు అడ్మిన్‌గా ఉంటూ షాడో గ్రూపును ప్రతిభావంతంగా పరిపోషిస్తూన్నారు. ఈ కార్యక్రంమలో సభాధ్యక్షులు శ్రీ రాణాప్రతాప్ గారు, నిర్వాహకులు శ్రీ ఎస్.ఆర్.ఎస్. కొల్లూరి గారు పల్గొన్నారు. తదనంతరం అష్టావధాని, బహుముఖ ప్రజ్ఞాశీలి శ్రీ కడిమెళ్ళ వరప్రసాద్ గారి చేతులమీదుగా ఉమామహేశ్వరిని దుశ్శాలువా, జ్ఞాపికతో సత్కరించారు.
ఆమె కవిసమ్మేళనంలో కూడా పాల్గొని ఆంధ్ర సారస్వత పరిషత్ వారి ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ తెలుగు సంబరాల ప్రశంసా పత్రమును కూడా పొందారు.ఈ కార్యక్రమంలో వివిధ ప్రక్రియల రూపకర్తలు పాల్గొన్నారు.అందరి సముఖాన పెద్దల మన్నన పొందడం తన పూర్వ జన్మ సుకృతమని ఎందరో పెద్దలను ఒకే వేదిక పైన చూసే అవకాశం కలిగిందని ఉమామహేశ్వరి తెలిపారు. ఇందుకు గాను ఆమెను కుటుంబ సభ్యులు, సహాధ్యాపకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పలువురు కొనియాడారు