మకరజ్యోతి దర్శనం కోసం శబరిమల భక్తజనం
శబరిమలలో భక్తులకు మకరజ్యోతి దివ్యదర్శనమిచ్చింది. పొన్నాంబలమేడు కొండల్లో జ్యోతి స్వరూపంలో అయ్యప్ప దర్శనమిచ్చారు.
మకరజ్యోతిని దర్శనం వల్ల భాగ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.
మకరజ్యోతి దర్శనం కోసం శబరిమల భక్తజనం తరలివచ్చింది. పంబ, పులిమేడ్, నీలికల్ ప్రాంతాల్లో జ్యోతి వీక్షణకు ఏర్పాట్లు చేశారు. శబరిమలలో కోవిడ్ నిబంధనలను అధికారులు అమలు చేస్తున్నారు. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతిచ్చారు. పంబ నుంచి సన్నిధానం వరకు అయ్యప్ప భక్తులు వేచి ఉన్నారు.
ఇరుముడులతో వచ్చిన అయ్యప్పలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మకర సంక్రాంతి రోజు జ్యోతిని దర్శించుకుంటే సాక్షాత్తు అయ్యప్పస్వామి కనపడినట్లుగా భక్తులు భావిస్తారు. అందుకనే జ్యోతికి ప్రతి ఏడాది ఎక్కువగా అయ్యప్పలు వస్తుంటారు..