దసరా పండుగను పురస్కరించుకుని ఏపీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) జి.జయరావు తెలిపారు.
ఈ నెల 22వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సుమారు 1202 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు.
బీహెచ్ఈఎల్, మియాపూర్ ఎక్స్‌రోడ్, కేపీహెచ్‌బీ, గచ్చిబౌలి, జీడిమెట్ల, ఈసీఐఎల్, ఎంజీబీఎస్, ఎల్బీనగర్ ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక బస్సులు నడపనున్నారు.
రాష్ట్రంలోని ముఖ్యమైన అన్ని ప్రాంతాలకు ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా వీలైనన్ని ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు.