విజయదశమి రోజే ఏపీ అసెంబ్లీకి శంకుస్థాపన చేయబోతున్నామని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. రాజధాని నిర్మాణంపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూౌ అమరావతిలో 1350 ఎకరాల్లో పరిపాలనా కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. 12న అసెంబ్లీ, హైకోర్టు, ఇతర ప్రభుత్వ భవనాల డిజైన్లపైౌ సీఆర్డీఏ ఉన్నతాధికారులతో నార్మన్‌ఫోస్టర్స్ బృందం చర్చలు జరుపుతున్నామని వివరించారు. 13న అసెంబ్లీ, హైకోర్టు తుది డిజైన్లకు ఆయన ఆమోదం తెలపనున్నారు. మరో రెండు రోజుల్లో బ్రిటన్ ఆర్కిటెక్ట్‌ల బృందం విజయవాడ రాబోతున్నట్లు చెప్పారు. బహుళ అంతస్థుల హౌసింగ్ నిర్మాణాలకు ఆయన శ్రీకారం చుట్టారు.