బి.జి.వేంచర్స్ పతాకంపై నూతన నటీనటులతో రాజేష్ తడకల స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తొన్న చిత్రం “గేమర్”. శ్రనిత్ రాజ్, కల్యాణి, అనిరుధ్,నేహా, చిత్రం శీను ప్రధాన పాత్రల్లొ నటిస్తున్నారు.. ఫిలిం ఛాంబర్ లో ఈ సినిమా ప్రెస్ మీట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జైన్, దిలిప్, గంగాధర్, నొవెల్ అగర్వాల్, జగదీష్ ముఖ్య అతిధులుగా వచ్చెశారు.
దర్శక నిర్మాత రాజేష్ తడకల మాట్లాడుతూ.. మా బి.జి.వేంచర్స్ పతాకంపై తెరకెక్కిన ఏడవ సినిమా ఇది. ప్రతి సారి కొత్త వారితొనె సినిమాలు చెస్తూ వస్తున్నాము. ఈ సినిమాతో శ్రనిత్ రాజ్, కల్యాణి హీరో హిరోయిన్ లుగా పరిచయం చెస్తున్నాము. బెట్టింగ్ నేపధ్యంలో సాగే ధ్రిల్లర్ ఈ గేమర్ మూవీ.. లవ్, హార్రర్ ఎలిమెంట్స్ కుడా ఉంటాయి. బి.జి.యాక్టింగ్ అకాడమీ ద్వారా నటీనటులను ఎంపిక చేసి ఈ సినిమాలో నటింపచేశాము.
హీరో శ్రనిత్ మాట్లాడుతూ.. గేమర్ లో నాది చాలెజింగ్ రోల్. ట్రెండింగ్ గా ఈ మూవీ ఉంటుందన్నారు.
అనిరుధ్ మాట్లాడుతూ…ఈ సినిమాలో నాది కామెడీ రోల్. దర్శక నిర్మాత రాజేష్ నటుడిగా నన్ను ఎంకరేజ్ చేశారన్నారు.
బి.జి యాక్టింగ్ అకాడమిలొనటన నెర్చికొవటానికి వస్తే తమకు హీరొయిన్ గా అవకాశం ఇచ్చారని నేహా, కల్యాణి తెలిపారు..