నితీష్ రెడ్డి హీరోగా సీనియర్ డైరెక్టర్ సాగర్ దర్శకత్వంలో ఫార్చ్యూన్ మూవీస్ వారు నిర్మిస్తున్న”ప్రభాస్”
చిత్రం 22 వ తేదీ ఉదయం అన్నపూర్ణ స్టూడియో లో వైభవంగా ప్రారంభం అయ్యింది.
హీరో నితీష్ రెడ్డి, హీరోయిన్స్ నందిని, అమృత లపై ఫస్ట్ షాట్ చిత్రీకరించారు. ఈ ఫస్ట్ షాట్ కి ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా,మరో సీనియర్ నిర్మాత,తెలంగాణఎఫ్.డి.సి ఛైర్మెన్ పీ. రామ్మోహన్ రావ్ క్లాప్ కొట్టారు.ప్రముఖ దర్శకులు ఎస్.వి. కృష్ణా రెడ్డి తొలి షాట్ కి
దర్శకత్వం వహించారు. పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు
సాగర్ మాట్లాడుతూ…1983 లో రాకాసి లోయ సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించాను. మావారి గోల,
స్టువర్టుపురం దొంగలు, అమ్మ దొంగ, అమ్మానా కోడలా వంటి డిఫరెంట్ సినిమాలకు దర్శకత్వం వహించాను అన్నారు.
నిర్మాతలు అశోక్ , సతీష్ రెడ్డి మాట్లాడుతూ... ఖర్చుకు వెనకాడకుండా భారీగా ఈ సినిమాను నిర్మిస్తున్నాం,
తెలుగు , హిందీ, తమిళ,కన్నడ భాషలకు చెందిన నటీనటులు ముఖ్య పాత్రలు పోషించబోతున్నారు.
చిత్ర ప్రారంభానికి విచ్చేసిన చిత్ర రంగ ప్రముఖులకు దర్శక , నిర్మాతలు హీరో కృతజ్ఞతలు తెలిపారు