తిరుమల, సెప్టెంబర్ 23: రాష్ట్ర ప్రభుత్వం తరుపున శనివారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారాచంద్రబాబు నాయడు శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ జరిగింది. శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలను సమర్పించే సాంప్రదాయం ఉన్న విషయం మనకు తెలిసినదే. రాత్రి 7.40 గంటలకు ముఖ్యమంత్రి తన సతీమణి భువనేశ్వరితో కలసి బేడీ ఆంజనేయస్వామి వారి ఆలయం చేరుకున్నారు.ఆంజనేయస్వామికి నమస్కరించుకుని అలయంవద్ద ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలను ఆలయ అధికారులు, ప్రభుత్వాధికారులు తీసుకు వచ్చి ముఖ్యమంత్రికి బేడీ ఆంజనేయస్వామి అలయంవద్ద తలపాగా చుట్టి పట్టువస్త్రాలు ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షు తులు ముఖ్యమంత్రి తలపై ఉంచారు. ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు తీసుకుని బయలుదేరి ఆలయమహాద్వారం చేరుకున్నారు. మహాద్వారం వద్ద ముఖ్యమంత్రికి ఆలయమర్యాదలతో స్వాగతం లభించింది.మహాద్వారం వద్ద టిటిడి ఇఓ అనిల్ కుమార్ సింఘాల్ , జిల్లా కలెక్టర్ పి.ఎస్.ప్రద్యుమ్న, టిటిడి సి.వి.అండ్ ఎస్.ఓ.రవికృష్ణ. టీటీడీ జేఈవో శ్రీనివాస రాజు, ఆలయ అర్చకులు స్వాగతం పలుకగా ముఖ్యమంత్రి వెంట జిల్లా మంత్రి అమనాద రెడ్డిసబ్ కలెక్టర్లు నిశాంత్ కుమార్ , వెట్రిసిల్వి, తిరుపతి అర్బన్ ఎస్.పి.అభిషేక్ మహంతి ప్రభుత్వ ఆలయ అధికారులు వున్నారు…………