మన సంస్కృతికి మారు పేరుగా నిలిచిన స్త్రీలోని ఎమోషనల్ యాంగిల్‌ను మా `అమ్మాయిలంతే ..అదోటైపు` సినిమాలో చూపిస్తున్నాం అంటున్నారు దర్శకుడు కృష్ణమ్. గోపి వర్మ, మాళవిక మీనన్, శివాజీ రాజా ప్రధాన పాత్రధారులుగా గాయత్రి రీల్స్ బ్యానర్‌పై కృష్ణమ్ డైరెక్టర్‌గా రూపొందుతోన్న చిత్రం `అమ్మాయిలంతే..అదోటైపు`. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది.
భావోద్వేగాలే హైలెట్ గా తెరకెక్కిన ప్రేమ కథా చిత్రమిది. డబ్బున్న కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి, తన తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల, తండ్రి ప్రేమకు దూరమవుతుంది. అప్పుడు ఆ అమ్మాయి, తండ్రి ప్రేమకి దూరమయ్యాననే కూతురు పడే బాధ, ఆ తరువాత జరిగే పర్యవసానల మధ్య సాగే ఎమోషనల్ కథ. నటీనటులు, టెక్నిషియన్స్ సపోర్ట్‌తో సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేయగలిగాం. ఇప్పుడు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్నాం. మంచి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కుదిరింది. త్వరలోనే ఆడియోవిడుదల చేసి, అక్టొబర్ లొ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయని దర్శక నిర్మాతలు తెలిపారు.
గోపి వర్మ, మాళవిక మీనన్, శివాజీ రాజా, సాయి, భద్రమ్, వేణుగోపాల్, భరత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి
ఎడిటర్ః గోపీ సిందం,
సినిమాటోగ్రఫీః శ్రీనివాస్,
సాహిత్యంః పూర్ణాచారి,
దర్శకత్వంః కృష్ణమ్.