వీడుతేడా చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్ఇ “లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాణ సంస్థని స్థాపించి తన స్నేహితుడు నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమాతో నటుడు చిన్ని కృష్ణ దర్శకుడిగా పరిచయం చేశారు నిర్మాత చక్రి చిగురుపాటి. ఆ తర్వాత సుధీర్ వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ నిఖిల్ హీరోగా నిర్మించిన స్వామి రారా ఎంతటి ఘనవిజయాన్ని సాధించటమే కాకుండా ఓ ట్రేండ్ క్రియేట్ చేశారు. ఈ సినిమాతో “లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్” బ్యానర్ కు, నిర్మాతగా చక్రి చిగురు పాటికి మంచి పేరొచ్చింది. ఆ తర్వాత సుధీర్ బాబు హీరోగా ఎ.ఎన్.బోస్ దర్శకుడిగా మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని నిర్మించి కమర్షియల్ సక్సస్ ని అందుకున్నారు. ఇలా వరుసగా మూడు చిత్రాలకు ముగ్గురు కొత్త దర్శకుల్ని తెలుగు తెరకు పరిచయం చేసిన అతితక్కువ నిర్మాతల్లో చక్రి చిగురుపాటి ఓ ప్రత్యేఖ స్థానం సంపాయించాడు. “లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్”. కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడంలో తాము రెడీగా ఉంటామని ఈ మూడు సినిమాలతో ప్రూవ్ చేసుకున్నారు నిర్మాత.
ఇక ఇప్పుడు సందీప్ కిషన్ హీరోగా కేరాఫ్ సూర్య పేరుతో ద్వి భాషా చిత్రాన్ని కేరాఫ్ సూర్య ని నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్‌ని ఈ నెల 25న నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా విడుదల చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ గా.. ఎమోషనల్ స్టోరీస్ ని అద్భుతంగా తీయగలడన్న పేరున్న సుశీంద్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. దీని తరువాత సూపర్ హిట్స్ అందుకున్న అల్లు వారి వారసుడు అల్లు శిరీష్ హీరోగా, ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంతో ఇంటెల్లిజెంట్ సూపర్ హిట్ చిత్రం అందించిన వి.ఐ.ఆనంద్ దర్శకుడిగా “లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్” బ్యానర్లో 5వ చిత్రంగా చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ గా రూపోందుతున్న ఈ చిత్రం నవంబర్ లో విడుదల కి సిధ్ధమవుతుంది. అంతే కాదు మరో ఇద్దరు యంగ్ హీరోలతో చిత్రాలు నిర్మించే దిశగా ఈ సంవత్సరం ప్లాన్ చేస్తున్నారు.
వరుసగా యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్న ఈ యంగ్ నిర్మాత చక్రి చిగురుపాటికి జన్మదిన శుభాకాంక్షలు
Attachments area