దసరా శరన్నవరాత్రుల మహోత్సవాలలో 5వ రోజైన ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంతో విరాజిల్లుతూ పూజలందుకుంటారు.
త్రిమూర్తుల కన్నా పూర్వం నుంచే ఉన్నది కాబట్టి త్రిపుర సుందరి అని పిలువబడుతుంది. శ్రీచక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధి దేవతగా తనని కొలిచే భక్తులను,
ఉపాసకుల్ని లలితా త్రిపుర సుందరీ దేవి అనుగ్రహిస్తుంది. ఆదిశంకరాచార్యులు శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి’గా పిలవబడేది.
శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్టించిన అనంతరం అమ్మ పరమశాంత రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది.
పంచదశాక్షరీ మహామంత్రం అధిష్ఠాన దేవతగా లలితా త్రిపురసుందరిని ఆరాధిస్తారు. లక్ష్మీ దేవి, సరస్వతీ దేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తూ ఉండగా చిరుమందహాసంతో,
భక్తి పావనాన్ని చిందే చెరుకు గడను చేతపట్టుకొని, శివుని వక్షస్థలంపై కూర్చొని దేవి దర్శినమిస్తుంది. కుంకుమతో నిత్యపూజలు చేసే సువాసినులకు తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది.
శ్రీచక్రానికి కుంకుమార్చన – లలితా అష్టోత్తరము చేసి, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే మంత్రము 108 మార్లు జపిస్తే మంచిది.
పులిహోర, పెసర బూరెలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి.