విశాఖ శ్రీ శారదపీఠంలో దేవిశర్రన్నవరాత్రులలో భాగంగా పీఠాదిపతి శ్రీస్వరూపనదేంద్ర సరస్వతి స్వామిజి శ్రీశారద అమ్మవారికి విశేషాభిషేకాలు నిర్వహించారు.స్వామిజి సకలదేవతల నిలమైన గోమాతకు గోపూజ నిర్వహించిన అనంతరం శారదమాతకు శుద్దజలాలు , క్షీరం , పసుపు , చందనం వంటి మంగళకర ద్రవ్యాలతో అభిషేకించి మంగళనీరాజనాలు సమర్పించారు.అభిషేక జలాలను భక్తులపై సంప్రోక్షణ నిర్వహించి అనుగ్రహబాషణ చేశారు.కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గున్నారు