HomeUncategorizedVizagvision నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్స్ ఎలైన్స్ (ఎన్ఐఎస్ఏ) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19వ తేదీన ఛండీఘడ్లో ‘మాన్తన్ స్కూల్ ఎడ్యుకేషన్ కాన్క్లేవ్’ పేరిట స్కూల్ లీడర్స్ మీట్‌కి విశాఖలో ప్రముఖ విద్యాసంస్థ స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ అధినేత మళ్ల రామునాయుడు వక్తగాఎంపికయ్యారు. అఖిల భారత స్కూల్ లీడర్స్ మీట్ ఫిబ్రవరి 19న చండీఘడ్ ఇంద్ర ధనుష్ ఆడిటోరియంలో జరుగుతోంది. ఈ మీట్‌కి దేశంలో 26 రాష్ట్రాల నుండి 1200 మందికి పైగా ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్స్, కరస్పాండెట్స్ డెలిగేట్లుగా హాజరవుతున్నారు. ఈ సమావేశంలో ‘నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020-కొత్త విద్యా విధానం’ అనే అంశంపై, ‘విద్యా విధానంలో ఉన్న కొత్త ఒరవడుల’ గురించి మాట్లాడే అరుదైన అవకాశం మళ్ల రామునాయుడుకు దక్కింది. ఈ దశకం 2020లో ఇన్నోవేటివ్ స్కూల్స్ ఇన్ ఇండియా అనే సర్వేను నీసా సంస్థ నిర్వహించింది. భారతదేశం నుంచి 32 స్కూళ్లను ఈ సంస్థ ఎంపిక చేసింది. ఈ 32 స్కూళ్లకూ ర్యాంకులు ఇవ్వగా, ‘ఒత్తిడి లేని విద్య’ అందించినందుకు స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్‌కి దేశంలోనే నెంబర్ ఒన్ ర్యాంకు లభించింది. ఈ క్రమంలో ఎడ్యూ ఈజీ సంస్కర్త రామునాయుడుకు మీట్లో వక్తగాపాల్గొనే అరుదైన గౌరవం లభించడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తవుతున్నాయి. ఇలాంటి అవకాశం ఇచ్చిన ఎన్ఐఎస్ఏ సభ్యులు, టీచర్లు, స్కూల్ పిల్లలు వారి తల్లిదండ్రులకు, రామునాయుడు కృతజ్ఞతలు తెలిపారు.
Vizagvision నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్స్ ఎలైన్స్ (ఎన్ఐఎస్ఏ) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19వ తేదీన ఛండీఘడ్లో ‘మాన్తన్ స్కూల్ ఎడ్యుకేషన్ కాన్క్లేవ్’ పేరిట స్కూల్ లీడర్స్ మీట్‌కి విశాఖలో ప్రముఖ విద్యాసంస్థ స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ అధినేత మళ్ల రామునాయుడు వక్తగాఎంపికయ్యారు. అఖిల భారత స్కూల్ లీడర్స్ మీట్ ఫిబ్రవరి 19న చండీఘడ్ ఇంద్ర ధనుష్ ఆడిటోరియంలో జరుగుతోంది. ఈ మీట్‌కి దేశంలో 26 రాష్ట్రాల నుండి 1200 మందికి పైగా ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్స్, కరస్పాండెట్స్ డెలిగేట్లుగా హాజరవుతున్నారు. ఈ సమావేశంలో ‘నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020-కొత్త విద్యా విధానం’ అనే అంశంపై, ‘విద్యా విధానంలో ఉన్న కొత్త ఒరవడుల’ గురించి మాట్లాడే అరుదైన అవకాశం మళ్ల రామునాయుడుకు దక్కింది. ఈ దశకం 2020లో ఇన్నోవేటివ్ స్కూల్స్ ఇన్ ఇండియా అనే సర్వేను నీసా సంస్థ నిర్వహించింది. భారతదేశం నుంచి 32 స్కూళ్లను ఈ సంస్థ ఎంపిక చేసింది. ఈ 32 స్కూళ్లకూ ర్యాంకులు ఇవ్వగా, ‘ఒత్తిడి లేని విద్య’ అందించినందుకు స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్‌కి దేశంలోనే నెంబర్ ఒన్ ర్యాంకు లభించింది. ఈ క్రమంలో ఎడ్యూ ఈజీ సంస్కర్త రామునాయుడుకు మీట్లో వక్తగాపాల్గొనే అరుదైన గౌరవం లభించడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తవుతున్నాయి. ఇలాంటి అవకాశం ఇచ్చిన ఎన్ఐఎస్ఏ సభ్యులు, టీచర్లు, స్కూల్ పిల్లలు వారి తల్లిదండ్రులకు, రామునాయుడు కృతజ్ఞతలు తెలిపారు.