VIZAGVISION:Accident Bolero car crash to Auto in Bhimili 2 dead,Visakhapatnam…భీమిలీలో బొలెరో కారు బీభత్సం: ఇద్దరి మృతిబొలెరో వాహనం బీభhత్సం సృష్టించింది. అతివేగంతో జనాలపైకి దూసుకురావడంతో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. విశాఖ జిల్లాలోని భీమిలీ తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం ఉదయం ఓ బొలేరో వాహనం వేగంగా దూసుకువచ్చి రహదారి పక్కన నడుచుకుంటూ వెళ్తోన్న జనాలపైకి దూసుకువచ్చింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరికొందరు గాయపడ్డారు. కాగా… మృతిచెందిన వారిలో ఒకరు డ్యాక్యమెంట్ రైటర్ గా గుర్తించారు. సమాచారమందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అలాగే కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.