అడివి శేష్ హీరోగా…
‘వినాయకుడు’, ‘విలేజ్లో వినాయకుడు’, ‘కేరింత’ వంటి చిత్రాల ద్వారా దర్శకుడు అడివి సాయికిరణ్ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా గవర పార్థసారధి నిర్మిస్తోన్న చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ త్వరలో ఆరంభం కానుంది. మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు.
సంకల్ప్ రెడ్డి సినిమా త్వరలో ప్రారంభం
ఇండియన్ ఫస్ట్ సబ్మెరైన్ మూవీ ‘ఘాజి’ ద్వారా జాతీయ స్థాయిలో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు సంకల్ప్ రెడ్డి. ఆయన దర్శకత్వంలో ఓ సెన్సేషనల్ మూవీ నిర్మించడానికి గవర పార్థసారధి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఓ ప్రముఖ యువకథానాయకుడు ఈ చిత్రంలో నటించనున్నారు.