సేవా తత్పరుడు సతీష్ మేకా అమెరికాలోని ప్రతిష్టాత్మక ‘తానా’ ఫౌండేషన్ ట్రస్టీగా నియమితులయ్యారు. నాలుగేళ్ల పాటు ఆయన ఆ పదవిలో ఉంటారు. తనను ఈ పదవికి ఎంపిక చేసిన తానా బోర్డు అఫ్ డైరెక్టర్స్ తో పాటు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ సతీష్ ఈ సందర్భంగా ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలియజేశారు. సతీష్ ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థుల మెరుగైన చదువు కోసం 25 కు పైగా డిజిటల్ క్లాస్ రూంలు ఏర్పాటు చేయించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా జర్నలిస్టులు సహా పలువురికి వైద్య సాయిం అందించారు. తానా ఫౌండేషన్ ట్రస్టీ విద్యాధర్ గారపాటి గారితో కలిసి అనేక సేవా కార్యక్రమాలలో కీలక పాత్ర పోషించారు.క్యాన్సర్ నివారణ,అవగాహనా పై బసవతారకం క్యాన్సర్ హాస్పటల్,గ్రేస్ క్యాన్సర్ ఫాండేషన్ తో కలిసి వందకు పైగా వైద్యశిబిరాలు నిర్వహించారు. ప్రస్తుత బోర్డు అఫ్ డైరెక్టర్ జనార్దన్ నిమ్మలపూడి చేపట్టిన తానా బసవతారకం క్యాన్సర్ ప్రాజెక్ట్ లో ముఖ్య భూమిక పోషించారు. కరోనా వైరస్ ఉదృతంగా భారత్ లో విస్తరిస్తున్న సమయంలో 5వేల ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు అందజేయడంలో సతీష్ కీలక పాత్ర పోషించారు. ఈ నెలలో జరిగిన తానా మహాసభల్లో ఎన్ఠీఆర్ శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్ పర్సన్ గా వ్యవహరించి ఎన్టీఆర్ మెమోరియల్,తానా కమిటీ ని సమన్వయపరుస్తూ శతజయంతి ఉత్సవాలను కనీవినీ ఎరగని రీతిలో నిర్వహించి అందరి మన్ననలు పొందారు.ఈ మహాసభలకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా పాల్గొన్న సంగతి తెలిసిందే.తనకు అన్ని విధాలా సహకరిస్తున్నతానా మాజీ అధ్యక్షులు అంజయ్య చౌదరిలావు ,తానా ఫౌండేషన్ ట్రస్టీ విద్యాధర్ గారపాటి, బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ జనార్దన్ నిమ్మలపూడి,డాక్టర్ శ్రీనివాస్ కొడాలి,తానా కార్యవర్గానికి సతీష్ కృతజ్ఞతలు తెలిపారు.
మన వైజాగ్ వాసే …
‘తానా’ ఫౌండేషన్ ట్రస్టీగా నియమితులైన సతీష్ మేకా మన వైజాగ్ వాసే .పదోతరగతి వరకూ జ్ఞానాపురంలోని సెయింట్ పీటర్స్ పాఠశాలలో ,ఇంటర్మీడియట్ పెందుర్తి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ,డిగ్రీ ,పీజీ విశాఖలోనే చదువుకున్నారు.రెండు దశాబ్దాల క్రితం అమెరికా వెళ్లి స్థిరపడ్డారు.స్కూల్ లో చదువుతున్నప్పుడే రెడ్ క్రాస్ లో చురుకుగా పాల్గొనేవారు.అప్పట్లో ప్రభత్వం ప్రవేశ పెట్టిన వయోజన విద్య కార్యక్రమంలో పాల్గొని రైల్వే క్వార్టర్స్ స్లమ్ లోని పెద్దలకు అక్షర జ్ఞానం అందించే బృందంలో సభ్యుడిగా వున్నారు.తాను చదువుకొన్న జ్ఞానాపురంలోని సెయింట్ పీటర్స్ పాఠశాలలో తన సొంత నిధులతో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశారు.అదే సమయంలో విశాఖ,ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ను ఏర్పాటు చేశారు.ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా కష్ట సమయంలో విశాఖలో అనేకమందికి వైద్య సహాయం అందించారు.తాను స్థాపించిన అభీష్ఠి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తన మిత్రబృందం సహకారంతో పేదలకు నిత్యావసర సరుకులు అందించారు.విషమ పరిస్థితుల్లో వున్నవారికి ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు సైతం సమకూర్చారు.గత పదేళ్ల కాలంలో ఆపదలో వున్నా పేదలతో పాటు పలువురు జర్నలిస్టులకు వైద్యానికి సహాయం అందించారు.గత 24 నెలల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో వందకు పైగా క్యాన్సర్ క్యాంప్ లు నిర్వహించిన బృందంలో కీలక పాత్ర పోషించారు..తానా ఆధ్వర్యంలో బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ కు కోటి రూపాయల విరాళాల సేకరణ బృందంలో వున్నారు.ఎన్టీఆర్ మెమోరియల్ ,తానా ఆధ్వర్యంలో జరిగిన ఎన్ఠీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా సుమారు కోటి రూపాయల ఫండ్ సమకూర్చడంలో ప్రధాన పాత్ర పోషించారు.ఇలా చెప్పుకుంటూ పోతే సతీష్ ఖాతాలో సేవా కార్యక్రమాల లెక్కకు అంతు ఉండదు.విశాఖలోని పెందుర్తి ప్రాంతానికి చెందిన సతీష్ మేకా ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక తానా’ ఫౌండేషన్ ట్రస్టీగా గా నియమితులవ్వడం పట్ల ఈ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.చిన్ననాటి నుంచే సేవాభావం పుణికి పుచ్చుకొన్న సతీష్ మేకా ఆ పదవికే వన్నె తెచ్చి మరిన్ని పదవులు అధిరోహించాలని కోరుకొంటున్నారు.