దేశ రాజధాని దిల్లీలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం దసరా సందర్భంగా ఎర్రకోట మైదానంలో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోదీ.. రావణాసురుడిపై బాణం సంధిస్తుండగా ధనుస్సు విరిగిపోయింది.
దాంతో పక్కనే ఉన్న వ్యక్తి మోదీకి మరో బాణాన్ని ఇస్తుండగా.. ఆయన నవ్వుతూ తన చేతిలో ఉన్న బాణాన్నే రావణాసురుడి దిష్టిబొమ్మపై విసిరారు.