అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో మిస్టీబిషి ఏసీలు
అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా మిస్టీబిషి కంపెనీ అధునాతన ఏసీ లను అందిస్తుందని డైరెక్టర్ నోహికో హాసోకవ అభివర్ణించారు. మహావిశాఖ 6 వ వార్డ్ పరిధి పీఎం పాలెం కార్ షెడ్ జంక్షన్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక షోరూమ్ ను అయన బుధవారం కంపెనీ సీనియర్ జనరల్ మేనేజర్ నీరజ్ గుప్తా తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నీరజ్ గుప్తా మాట్లాడుతూ నగర ప్రజల జీవన విధానం ఎంతో మార్పు చెందిందని అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ బాగా పెరిగిందని. అందుకు తగినట్టుగానే అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలో ఉండే విధంగా మిస్టీబీసీ షో రూమ్ లో ఎన్నో వెరైటీల ఏసీలు అందుబాటులో ఉంచారని అన్నారు. అనంతరం షోరూం అధినేత యామీన్ మాట్లాడుతూ విశాఖలో ఇది రొండోవ బ్రాంచిని మధురవాడలో అందుబాటులోకి తెచ్చామని అన్నారు, అన్ని వర్గాల ప్రజలకు ఉపోయోగపడేలా వివిధ రకాల ఉత్పతులను నేరుగా జపాన్ అలాగే థాయిలాండ్ నుండి దిగుమతి చేస్తున్నామని అన్నారు, మన్నికల సుమారు 10 సంవత్సరాలు వారంటీ అందిస్తున్న ఏకైక సంస్థ అని అన్నారు. ప్రపంచ దేశాల్లో ఇప్పటికే ఎంతో మంది మొగ్గుచూపుతున్నారని అన్నారు. అభిరుచి గల ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కంపనీ ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గున్నారు.