VIZAGVISION:St.Peter’s School 1987-88 Batch Old Students Meet,Visakhapatnam…సెయింట్ పీటర్స్ హైస్కూల్ పూర్వ విద్యార్దుల ఆత్మీయ సమ్మేళనం..ఆనాటి గురువులను ఘనంగా సన్మనం ….రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపిన పూర్వవిద్యార్దులు…జ్ఞానపురం సెయింట్ పీటర్స్ హైస్కూల్ లో 29 సంవత్సరాల క్రితం చదువుకున్న 1987-88 సంవత్సరానికి చెందిన 10వ తరగతి విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు సోమవారం విశాఖలో ఓ ప్రవేటు హాటల్ లో కలుసుకుని ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు .ఆనాటి జ్ఞాపకాలను, విద్యార్ది దశలో చేసిన అల్లర్లను, గురువులను ఆట పట్టించిన తీరును ఆ పూర్వ విద్యార్థులు నెమరువేసుకుంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా రోజంతా గడిపారు. ఒకరి నొకరు పలకరించుకుంటూ గతంలో వారు చేసిన చిలిపి చేష్టలను, అల్లర్లను గుర్తుకు తెచ్చుకుంటూ మధురానుభూతిని పొందారు . కొంత మంది విద్యార్థులు ఒకరిని ఒకరు గుర్తు పట్టుకోలేక అలాగే ఉండిపోయి కొన్ని క్షణాల అనంతరం గుర్తుకు వచ్చిన తరువాత ఆలింగనం చేసుకొని సంతోషాన్ని పంచుకున్నారు. వారి కుటుంబాల గురించి కష్ట నష్టాలు, సుఖ సంతోషాలు చర్చిచుకున్నారు. ఈ సమ్మేళనంలో పాల్గున్నా ప్రతి ఒక్కరు తమ భావాలను వ్యక్తీకరించారు. ఈ సందర్బంగా వారి ఎదుగుదలకు కాణమైన పాఠశాల ప్రధాన ఉపాద్యాయులు ఫాధర్ మ్యాచూ అల్ ఫాట్ ను గుర్తు చేసుకున్నారు. ఆ రోజులలో విద్యార్దులపై ఆయన చూపిన శ్రద్దను కోనియడారు. ఆనాడు వారు నేర్పిన క్రమశిక్షణనే నేడు మా ఉన్నతికి కారణమైందని పేర్కొన్నారు. ధనం పంచుకుంటూ పోతే తరిగేది. కాని పంచుతూ పోతే పెరిగేదే విద్య అని అలాంటి విద్యను ఎంతమందికి పంచితే అంత గొప్ప అని కొందరు గురువులు మాట్లాడారు.
మాకు అస్తుల కన్నా మా విద్యార్దుల ఎదుగుదల మాకు కొండంత్త అస్తి అని తెలిపారు. మీ అందరిని చాల రోజుల తరువాత ఈ విదంగా కలుసుకొవడం చాల అనందంగా ఉందాని అన్నారు. అనంతరం విద్యను బోధించిన ఆనాటి గురువులను ఘనంగా సత్కరించారు. పూర్వ విద్యార్థులు ఆట పాటల మధ్య సంబరంగా జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకోవాలని నిర్ణహించుకున్నారు. సెయింట్ పీటర్స్ స్కూల్ అలుమ్ని రియునైటడ్ స్కాలర్స్ హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ (స్పర్శ) ద్వార ప్రతి ఏడాది స్వచ్చంద సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్బంగా తీర్మానించారు.