సికింద్రాబాద్: సోమవారం సాయంత్రం నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్, నాగులపల్లి, మౌలాలి, ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల ప్రాంతాల్లో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది. సాయత్రంం 6నుంచి 8గంటల మధ్య 4 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేశారు. హైదరాబాద్ నుంచి సాయంత్రం 6.30గంటలకు బయల్దేరాల్సిన హైదరాబాద్-చెన్నై చార్మినార్ ఎక్స్‌ప్రెస్ (రైల్ నెంబర్: 12760) ఆలస్యంగా…. రాత్రి 7.25గంటలకు బయల్దేరింది. మౌలాలి స్టేషన్లో ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను, చర్లపల్లి స్టేషన్లో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను క్రమబద్ధీకరించినట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు. కొద్దిసేపటికే రైళ్ల రాకపోకలన్నీ యదావిధిగా నడిచాయని వారు వెల్లడించారు.