VIZAGVISION:Nithya Kalyana Mohotsavam Presence of Appana in Simhagiri,Visakhapatnam…ింహాచలం సింహగిరిపై అప్పన్న సన్నిధిలో ఘనంగా నిత్యకల్యాణమహోత్సవాం. తమిళనాడు కించిత్కారం ట్రస్ట్ కు చెందిన 160,నగరానికా చెందిన 8 మంది జంటలతో నిత్యకల్యాణం నిర్వహించారు. దేవస్థానం కల్యాణమండపంలో నిత్యా కల్యాణం సందర్భంగా స్వామి, ఉభయదేవేరులతో, ఆదిశేషునిపై అధిష్టింపజేసి స్వామివారి కల్యాణాన్ని భక్తులకు కళ్ళకు కట్టినట్టు నిర్వహించారు. కళ్యాణం లో పాల్గోన్న భక్తులు పరవశించిపోయారు. దేవస్థానం అధికారులు కల్యాణంలో పాల్గొన్న భక్తులకు నిత్య అన్నదాన సదుపాయాన్ని, అంతరాలయ దర్శనాన్ని కల్పించారు. కళ్యాణమండపాన్ని అనేకరకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. సింహగిరి అంతా హరినామ స్మరణతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గోపాలకృష్ణ మాట్లాడుతు గత 60 సంవత్సరాల ఆలయ చరిత్రలో ఒకే రోజు 168 నిత్య కల్యాణాలు జరగడం ఇదే ప్రధమంఅన్నారు. ఈ నిత్య కల్యాణంలో తమిళనాడుకు చెందిన సుమారు వెయ్యిమంది భక్తులు పాల్గొన్నారు. విశ్రాంత పురోహితులు మోర్త సీతారామాచార్యులు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.