రేపటి నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ..విజయనగరం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్ క్రీడా మైదానంంలో ఈనెల 6 నుండి 17వ తేది వరకు నిర్వహించనున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి జిల్లా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. గురువారం ఆర్ధరాత్రి 12 గంటల నుండి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. రోజుకు 5 నుండి 7 వేల మంది అభ్యర్ధులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. 6,7,8,9 తేదీలలో జనరల్ డ్యూటీ అభ్యర్దులకు ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 10,11 తేదీలలో టెక్నికల్ అభ్యర్థులకు, 12,13 తేదీల్లో సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్ అభ్యర్థులకు, 14,15,16,17 తేదీలలో ట్రేడ్‌మెన్ అభ్యర్ధులకు ఎంపిక నిర్వహిస్తారు.
ఆర్మీ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు నిర్ధేశించిన తేదీలలో ప్రవేశ పత్రాలతో ఎంపిక ప్రక్రియకు హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు. హాల్‌టికెట్ లేకపోతే మైదానంలోకి అనుమతించబోరని తెలిపారు. ప్రవేశ ద్వారం వద్ద అడ్మిట్ కార్డు పరిశీలించి మైదానంలోకి అనుమతిస్తారు. ప్రవేశ ద్వారం వద్ద అభ్యర్థుల ఎత్తు, ఛాతి కొలతను నిర్వహిస్తారు, ఎత్తు సరిపోతేే లోపలకు అనుమతిస్తారు.శారీరక పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు నవంబర్ 23న విశాఖపట్నంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. వచ్చే ఏడాది జనవరి లో ఫలితాలు వెల్లడిస్తారు