VIZAGVISION:Gold Smuggling Caught 374gms & 350gms at Airport Vizag ,Visakhapatnam..ఒకప్పుడు ముంబయి, హైదరాబాద్, చెన్నై వంటి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల మీదుగా విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఘరానాబాబులు ఇటీవల కాలంలో విశాఖ ఎయిర్‌పోర్టును ఎంచుకున్నారు.గడిచిన మూడేళ్లుగా విశాఖ ఎయిర్ పోర్టు ద్వారా విమానాల సంఖ్యతో ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. అదే స్థాయిలో స్మగ్లింగ్ కార్యకలాపాలు కూడా పెచ్చుమీరుతున్నాయి. గడిచిన మూడేళ్లలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ సుమారు 82 మంది పట్టుబడగా…10కోట్లకు పైగా విలువైన బంగారం కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్కువగా దుబాయి నుంచే బంగారం బిస్కెట్ల అక్రమ రవాణా సాగుతోంది. గత ఏడాది దుబాయి నుంచి నాలుగున్నర కేజీల బంగారాన్ని తీసుకొస్తున్న ఏడుగురిని కస్టమ్స్ పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు మహిళల నుంచి 4కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది టీవీలు, స్పీకర్లలో రూ.2కోట్ల విలువైన బంగారాన్ని స్మగింగ్ చే స్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
1.తాజాగా శ్రీలంకకు చెందిన అబ్దుల్ రజాక్ కడుపులో బంగారం కాయిన్స్ పెట్టుకుని రవాణా చేస్తూ కస్టమ్స్ పోలీసులకు చిక్కాడు. శ్రీలంక ఎయిర్‌లైన్స్‌లో శ్రీలంక నుంచి విశాఖకు చేరుకున్న రజాక్ బయటకొస్తుండగా… కస్టమ్స్ అధికారులు మెటల్ డిటెక్టర్‌తో తనిఖీలు చేస్తుండగా కడుపులో ఉన్న పసిడి బయటపడింది. అనుమానం వచ్చిన అధికారులు రజాక్‌ను బాత్ రూమ్‌లోకి తీసుకెళ్లి విచారించేసరికి అసలు విషయం కక్కేశాడు. ఒక్కొక్కటి వంద గ్రాముల చొప్పున బరువున్న 8 బిస్కెట్లు కవర్లో చుట్టి మింగేశాడు.మల ద్వారం నుంచి ఐదు కాయిన్స్ బయటకు తీయగలిగారు.ఆనంతరం మిగిలిన బంగారం కోసం కెజిహెచ్ కు తరలించారు..మూడు రోజులు కింగ్ జార్జి ఆసుపత్రిలో శ్రీలంక వాసి అబ్దుల్ మొహమ్మద్ రజాక్ కడుపులోనుండి బంగారు పిల్లెట్లు 16 కవర్లు వెలికితీసారు. శస్త్రచికిత్స అవసరం లేకుండానే మలద్వారం గుండా ఇవన్నీ బయటపడడంతో వైద్యులు, కస్టమ్స్ అధికారులు వూపిరి పీల్చుకున్నారు. ఎక్స్‌రేలు, స్కానింగు తీసి ఉదర భాగంలోని 12, మలరంధ్రంలోని రెండు కవర్లలో బంగారు గుళికలు ఉన్నట్లు గుర్తించారు.కవర్లన్నీ మలరంధ్రం ద్వారానే బయటకు వచ్చాయని కెజిహెచ్ ప్రదాన వైద్యాధికారి జి.అర్జున్ తెలిపారు. మొత్తం 16 కవర్లలో బంగారు గుళికలు బయటకు వచ్చాయని ఆయన వివరించారు. మళ్లీ ఎక్స్‌రేలు తీసి, లోపల ఎలాంటి కవర్లూ లేవని నిర్ధరించుకున్నాక సాయంత్రం రజాక్‌ను డిశ్చార్జి చేసి కస్టమ్స్ అధికారులకు అప్పగించినట్లు ఆయన వివరించారు.
అక్రమ రవాణాలో పట్టుబడిన నిందితుడు అబ్దుల్ రజాక్ నుంచి 347 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు విశాఖ కస్టమ్స్ విభాగం కమిషనర్ డి.కె.శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. నిందితుడు నేరాన్ని అంగీకరించాడన్నారు. అతనిచ్చిన సమాచారం ప్రకారం కేజీహెచ్‌కి తరలించగా అతని శరీరం నుంచి 347 గ్రాముల బంగారు పిల్లెట్లు బయటకు తీశారని, వాటి మార్కెట్‌విలువ రూ.పది లక్షలు పైగా ఉంటుందని వెల్లడించారు. గతంలో కూడా రజాక్ ఇదే రీతిలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడినట్టుగా సమాచారం. స్మగ్లర్లు సినీఫక్కీలో కడుపులో పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తుండడం కస్టమ్స్ పోలీసులకు సవాల్‌గా
2.కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో దుబాయ్ నుంచి వచ్చిన కేరళవాసి లతీఫ్ వీరకుట్టి వద్ద 350 గ్రాముల బంగారం, 14విదేశీ సిగరెట్లు లభ్యం.
పట్టుబడ్డ బంగారం విలువ 10.6లక్షలు,సిగరెట్ల విలువ16,800/-రూ.
నిఘా వర్గాల సమాచారం మేరకు నిర్వహించిన తనిఖీలు.
సూట్ కేసు పై కప్పులో మందంగా వున్న భాగంలో దాచివుంచిన లతీఫ్.