తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం నూతన వధూవరులు తనూజ, త్రిలోక్లతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. వీరికి తితిదే జేఈవో శ్రీనివాస రాజు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. వీరి వెంట వియ్యంకులు రమేశ్‌బాబు, హిమబిందు దంపతులు కూడా ఉన్నారు. అనంతరం వీరు తిరుమల నుంచి తిరుచానూరు చేరుకుని పద్మావతి అమ్మవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు.