దేవస్థానం బోర్డు సంచలన నిర్ణయం.ఇకపై “శబరిమల” దేవస్థానంలో పనిచేయనున్న అర్చకులు ఎవరో తెలుసా..?పురాతన కాలం నుంచి మన దేశంలో దళితులకు జరుగుతున్న అన్యాయాలు ఎలాంటివో అందరికీ తెలిసిందే. సమాజంలో వారికి తగిన గుర్తింపు ఉండదు. ఎక్కడికి వెళ్లినా అంటరానివారిగా వారిని చూస్తారు. ఇక దేవాలయాల్లోకి అయితే ప్రవేశమే ఉండదు. ఒక వేళ ఎవరికీ తెలియకుండా వారు ఆలయంలోకి ప్రవేశిస్తే ఇక అంతే, వారికి దారుణమైన శిక్ష వేస్తారు. అయితే ఇప్పటికీ ఇంకా ఈ అసమానత పోలేదు. కానీ కేరళలోని The Travancore Devaswom (Temple) Recruitment Board (TDB) మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై అక్కడి శబరిమల ఆలయంలో పలువురు దళితులు అర్చకులుగా పనిచేయనున్నారు.కాగా ట్రావెన్కోర్ ఆలయ బోర్డు దళితులను అర్చకులుగా ఎంపిక చేయడం పట్ల చాలా చోట్ల హర్షం వ్యక్తం అవుతోంది. దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనమే అవుతోంది. అయితే గతంలో ఎర్నాకులంలోని ఓ శివాలయంలో అర్చకుడిగా ఎంపికై కూడా అక్కడి బ్రాహ్మణ అర్చకుల కారణంగా ఓ వ్యక్తి అర్చకుని పోస్టుకు దూరమయ్యాడు. ఇక అంతకు ముందు కూడా అలప్పురలో ఉన్న ఓ దుర్గా ఆలయంలో మరో దళిత అర్చుకున్ని కూడా ఇలాగే నిరాకరించారు. దీంతో వారు కోర్టులో పిటిషన్ పెట్టుకోగా అవి విచారణలో ఉండగానే ట్రావెన్కోర్ దేవస్థానం ఇలా సంచలన నిర్ణయం తీసుకుంది. ఏది ఏమైనా దళితులకు అలా ఆలయాల్లో అర్చకులుగా పోస్టులు రావడం అంటే మాటలు కాదు, ఇదే తొలిసారి. కనుక ఈ నిర్ణయం తీసుకున్న వారిని అభినందించాల్సిందే..