ఆకలి-రహిత ప్రపంచం’ సాధన దిశగా మలబార్ గ్రూప్ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ప్రతి రోజు 51,000 పోషకాహార ప్యాకెట్లను పంపిణీ చేయడానికి నిర్ణయించింది.

మలబార్ గ్రూప్ ప్రారంభించి, కొనసాగిస్తున్న సామాజిక సేవా కార్యక్రమం ‘ఆకలి రహిత ప్రపంచం. ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజూ నిరుపేదలకు పుష్టికరమైన భోజనాన్ని అందిస్తున్నారు. ఇకపై ఈ కార్యక్రమం మరింత మంది ప్రజలకు మరియు నగరాలకు విస్తరించబడుతుంది. ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్-2 జీరో హంగర్ ప్రోగ్రాంకు మద్దతుగా ప్రారంభించబడిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కింద ప్రస్తుతం 31,000 ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయబడుతున్నాయి. ఇకపై ఈ సంఖ్యను పెంచుతూ 51,000 పుష్టికరమైన ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయబడతాయి.
మలబార్ గోల్డ్ & డైమండ్స్ గౌరవనీయులైన స్టోర్ లో, మే 28వ తేదీన జరిగిన ‘వరల్డ్ హంగర్ డే’ కార్యక్రమంలో .గారు ఈ విస్తరణ ప్రణాళికను అధికారికంగా ప్రారంభించారు. శ్రీ హెడ్ గారు, ఈ కార్యక్రమానికి అతిథులకు స్వాగతం పలికి, కృతజ్ఞతలు తెలియజేసారు. స్టోర్
ప్రస్తుతం ఈ కార్యక్రమం గల్ఫ్ దేశాల్లోని కొన్ని కేంద్రాలతో పాటు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సహా 16 రాష్ట్రాలలో విస్తరించి ఉన్న 37 నగరాల్లో అమలు చేయబడుతోంది. ప్రస్తుత విస్తరణలో భాగంగా, ఈ కార్యక్రమం ఇప్పుడు 16 రాష్ట్రాల్లోని 70 నగరాల్లో చేపట్టబడుతుంది. అంతే కాకుండా, ప్రపంచంలోనే అతిపెద్ద స్థాయి బంగారు గనులకు ప్రసిద్ధి చెందిన ఆఫ్రికన్ దేశం జాంబియాలోని పాఠశాల విద్యార్థులకు సైతం ఈ కార్యక్రమం ద్వారా సేవలు అందించాలని మలబార్ గ్రూప్ యోచిస్తోంది.
ఈ సందర్భంగా శ్రీ ఎంపి అహ్మద్ మాట్లాడుతూ “మన చుట్టూ చాలా మంది వ్యక్తులు ఆకలితో అలమటిస్తున్నారు, వారు రోజుకు కనీసం కడుపునిండా ఒకసారి భోజనం చేయడానికి ఏంతో కష్టపడుతున్నారు. మన ప్రపంచం నుండి ఆకలిని తరిమివేయడానికి కృషి చేస్తున్న ప్రభుత్వాలు మరియు ఏజెన్సీలకు మద్దతుగా మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము” అన్నారు.
సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో అత్యంత గుర్తింపు పొందిన ఎన్.జి.ఓ ‘థనల్ దయా రిహాబిలిటేషన్ ట్రస్ట్’ సహాయంతో ‘హుగర్ ఫ్రీ వరల్డ్ ప్రోగ్రామ్’ అమలు చేయబడుతుంది. వివిధ ప్రాంతాల్లో, పరిశుభ్రమైన వాతావరణంలో, ఎంతో నైపుణ్యం కలిగిన చెఫ్‌ల ద్వారా పౌష్టికాహారాన్ని తయారు చేసేందుకు ఆధునిక వంటశాలలు ఏర్పాటు చేయబడ్డాయి. మలబార్ గ్రూప్ మరియు థనల్ వాలంటీర్లు వీధులు మరియు పట్టణ శివారు ప్రాంతాలలో నిరుపేదలను గుర్తించి, ఆహార ప్యాకెట్లను వారి ఇంటి వద్దకే తీసుకుని వచ్చి అందిస్తారు.
సమాజంలో ఆకలికి సంబంధించి సామాజిక మరియు ఆర్థిక కారణాలను అంచనా వేయడానికి మా ఎన్.జి.ఓ వాలంటీర్లు లబ్దిదారులను సర్వే చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా, మలబార్ గ్రూప్ మరియు థనల్ కలిసి, పేద మరియు అనాథ వృద్ధ మహిళలను గుర్తించి, వారికి ఉచిత ఆహారం, వసతి మరియు ఇతర ఆరోగ్య సంరక్షణను అందించడానికి ఇప్పటికే ‘గ్రాండ్ మా హోమ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. అలాంటి రెండు ‘గ్రాండ్ మా హోమ్ ‘ లను బెంగళూరు, హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, ముంబై, కేరళలోని కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో ఇలాంటి ‘హోమ్’ లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నిర్లక్ష్యానికి గురైన మరియు అనాథ మహిళలకు గౌరవంగా జీవించడానికి ఈ హోమ్స్ అవకాశం కల్పిస్థాయి. వీధి బాలల ప్రాథమిక విద్య కోసం గ్రూప్ మైక్రో లెర్నింగ్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రారంభించింది.
ఇవి మాత్రమే కాకుండా, మలబార్ గ్రూప్ ఇతర సాంఘిక సంక్షేమం మరియు వైద్య సంరక్షణ మరియు విద్యార్థినులకు విద్య మరియు పేదల ఇళ్ల నిర్మాణానికి పాక్షికంగా మద్దతు అందించడం వంటి స్వచ్చంద సేవా కార్యక్రమాలలో సైతం చురుకుగా పాల్గొంటుంది. మలబార్ గోల్డ్ & డైమండ్స్ తో సహా, మలబార్ గ్రూపులోని వివిధ వ్యాపార విభాగాల నుండి వచ్చే లాభాలలో ఐదు శాతాన్ని సామాజిక సేవ మరియు సంక్షేమ కార్యకలాపాల కోసం కేటాయిస్తుంది. ఇటువంటి సామాజిక సంక్షేమ కార్యక్రమాల కోసం ఇప్పటికీ 246 కోట్ల రూపాయలను మలబార్ గ్రూప్ ఖర్చు చేసింది.