తిరుపతిలో భారీగా ఎర్రచందనం పట్టివేత.
తిరుపతిలోని కరకంబాడి రోడ్డులో మంగళవారం ఉదయం పెద్దఎత్తున ఎర్రచందనాన్ని పట్టుకున్నారు. కరకంబాడి రోడ్డులో రిజర్వు ఎస్సై విజయ్ బృందం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా 70 ఎర్రచందనం దుంగలు, ఓ టిప్పర్ ను స్వాధీనం చేసుకున్నారు. కాగా… పోలీసుల రాకను గమనించిన స్మగ్లర్లు పరారయ్యారు. ఇదిలా ఉండగా ఎర్రచందనం దుంగలు లభ్యమైన ప్రదేశం వద్ద భారీగా బీరు బాటిళ్లు, ఆహారం ప్యాకెట్లు ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసులు వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు.