VIZAGVISION:Storm Once Again Heavy Rains Next 24Hours Weather Forecast,Visalkapatnam…మరోసారి తుఫాను బీభత్సం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది.
దక్షిణ బంగాళాఖాతానికి ఆనుకుని తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు.
కోస్తాంధ్రలో కొన్నిచోట్ల చెదురుమదురుగా వర్షం కురుస్తోందని.. బుధవారం నుంచి వర్ష ప్రభావం పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
తీవ్ర అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొన్నారు.
అక్టోబర్ 19వ తేదీకి ఇది మరింతగా బలపడి వాయుగుండంగా మారే వకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఇది వాయువ్య దిశగా పయనించి ఉత్తర కోస్తాంధ్ర-దక్షిణ ఒడిశా మధ్య తీరాన్ని తాకుతుందని పేర్కొంది.