VIZAGVISION:Heavy Rains in Visakhapatnam Weather Report,Visakhapatnam… బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం,విశాఖలో భారీ వర్షం..బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ ప్రభావంతో కోస్తా అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాయుగుండం దక్షిణ ఆగ్నేయ దిశగా పూరికి 370కిలోమీటర్లు, ఒరిస్సా చాంద్బలికి దక్షిణంగా 470 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయినట్లు అధికారులు తెలిపారు. ఈ వాయుగుండం ఉత్తరం వాయువ్యదిశగా పయనిస్తోందని, నేటి అర్థరాత్రి లేదా రేపు తెల్లవారుజామున పూరీ చాంద్బలీ మధ్య ఒడిశా తీరాన్ని తాకే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
రానున్న 18గంటల్లో తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.