ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి,
ప్రజాపిత బ్రహ్మకుమారీస్ విశాఖపట్నం లోని అన్ని సేవా కేంద్రాల వారి తరపునుండి చేసుకొను విన్నపం ఏమనగా,
మన విశాఖపట్నంలోని సింహాచలం పుణ్యక్షేత్రంలో లక్షలాదిమంది భక్తులకు సందర్శనార్థం మేము ఒక ఆధ్యాత్మిక పరమైన మ్యూజియం ను నిర్మించాలని సంకల్పించుకున్నాము. ఈ ఆధ్యాత్మిక మ్యూజియం నందు సనాతన ధర్మాన్ని అద్దం పట్టే విధముగా దేవతల విగ్రహాలతో పాటు, సామాజిక నైతిక విలువలు తెలియచేసే విధంగా అన్ని వయసుల వారికి ఆత్మజ్ఞానాన్ని బోధించుటకు సుందరమైన చిత్రాలను అమర్చాలనుకుంటున్నాము. ఇది కాకుండా చదువుకునే విద్యార్థులకు సైన్స్ పరమైన ఆధ్యాత్మికతను కలిపి జ్ఞానవిజ్ఞానమును బోధించుటకు మరిన్ని చిత్రాలను ఏర్పాటు చేయదలచుకున్నాము. భక్తులకు వైద్య సౌకర్యార్థం ఒక చిన్న చికిత్సా లయమును ప్రధమ చికిత్స కొరకు రెండు గదులతో ఏర్పాటు చేయదలుచుకున్నాము. వీటి నిర్మాణం కొరకు మన రాష్ట్ర ప్రభుత్వం వారి నుండి సింహాచలం కొండ దిగువ ప్రాంతంలో భక్తులు మెట్లుఎక్కే చోట ఒక వెయ్యి గజాలను మా సంస్థకు
ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాము. ప్రభుత్వం వారు దయచేసి వెయ్యి గజాలలో ఆధ్యాత్మిక సంగ్రహాలయాన్ని నిర్మించడమే కాకుండా ఈ చికిత్సా ఆలయాన్ని కూడా నిర్మించడానికి మాకు దిగువ సింహాచలం ప్రాంతంలో భక్తులకు అనుకూలంగా స్థలాన్ని కేటాయించగలరని ఆశిస్తున్నాము. శారీరక, మానసిక, సామాజిక ఆధ్యాత్మిక నిరంతర సేవలను మేము ప్రజానీకానికి ఉచితంగా అందివ్వగలమని సవినయముగా తెలియజేసుకుంటున్నాము.