VIZAGVISION:Helicropter Tourism in Vizag Trial Run Completed by Vuda & Navy,Visakhapatnam…పర్యాటకరంగంలో దూసుకుపోతున్న విశాఖకు మరో కొత్త ఆకర్షణ తోడవుతోంది….ఆకాశంలో విహరిస్తూ విశాఖ అందాలను వీక్షించే అవకాశాన్ని త్వరలో తీసుకురాబోతున్నారు…దీనికి సంబంధించిన ట్రైల్ రన్ విజయవంతంగా సాగింది…… ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న హెలీ టూరిజంకు ఎట్టకేలకు ట్రైల్ రన్ నిర్వహించారు
అధికారులు….వుడా అధికారులు పవన్ హన్స్ నిర్వహకులు తొలిసారి విశాఖలోనిి వుడాపార్క్ లో హెలికాఫ్టర్ ను ల్యాండింగ్ , టేక్ ఆఫ్ లు నిర్వహించారు…ఇందుకోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు…
పైలెట్ తో పాటు ఆరుగురు కూర్చునేందుకు ఇందులో అవకాశంవుంది…..సుమారు 10 నిమిషాల సమయంలో నగరాన్ని విహంగ వీక్షణంలో చుట్టిరావచ్చు…..
అయితే ప్రస్తుతానికి ట్రైల్ రన్ అయితే జరిగిందిగానీ వీటి సర్వీసులను ప్రారంభించేందుకు నేవీ నుంచి
అనుమతులు ఇంకారావాల్సి వుందన్నారు పైలెట్ శ్రీనివాసరావు..
ఇందులో ఎక్కేందుకు టెక్కెట్ ధర ఒక్కక్కరికి 2వేల రూపాయిలు….ఇది సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని అప్పుడే ప్రజాదరణ లభిస్తుందంటున్నారు పర్యాటకులు….
హెలీ టూరిజం కింద ఈ ప్రాజెక్టు కనుక అమల్లోకి వస్తే పర్యాటకులు సరికొత్తరీతిలో విశాఖ అందాలను వీక్షించే అవకాశం ఏర్పడినట్లే…