రెండు లక్షల మంది సమీకరణ,గిరిజన రైతు గర్జన’ పేరిట నవంబర్ 19వ తేదీన వరంగల్లో భారీ సభ నిర్వహించాలని, దీనికి రాహుల్ గాంధీని ఆహ్వానించాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. నవంబర్ 19 ఇందిరాగాంధీ శత జయంతి కూడా. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సమావేశం ఏర్పాటు చేస్తే బాగుటుందనే పార్టీ నేతల సూచనకు ఆర్.సి.కుంతియా అంగీకారం తెలిపినట్లు తెలిసింది. ఆదివారం వరంగల్ జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే రాహుల్ గాంధీ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ ఆయన ఆ తేదీ అంగీకరించని పక్షంలో ఒక రోజు ముందుగా అంటే నవంబర్ 18న సభ జరగడం కాయమని తెలుస్తోంది. రాహుల్ సభకు 2లక్షల మందికి తగ్గకుండా జనాన్ని సమీకరించాలని కుంతియా వరంగల్ జిల్లా నేతలకు పురమాయించినట్లు తెలిసింది.,