VIZAGVISION:Minister Nara Lokesh Bangalore tour,.టెక్ మహేంద్ర ప్రెసిడెంట్ అండ్ సిఓఓ రవిచంద్రన్ తో భేటీ అయిన మంత్రి నారా లోకేష్
2019 లోపు లక్ష ఐటి ఉద్యోగాలు కల్పించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాం
లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ సహకారం కావాలి
విశాఖపట్నం లో ఉన్న టెక్ మహేంద్ర సెంటర్ లో మరిన్ని ఉద్యోగాలు కల్పించాలి
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వస్తున్న నూతన టెక్నాలజీ ల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు
ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజిస్ ఏర్పాటు చేసాం
నూతన టెక్నాలజీ ల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను తీర్చిదిద్దడంతో పాటు ఇండస్ట్రీఅవసరాలకు అనుగుణంగా మా విద్యార్థులను తీర్చిదిద్దడానికి టెక్ మహేంద్ర ఐఐడిటి లో భాగస్వామ్యం కావాలి
వ్యవసాయాన్ని లాభసాటిగానూ,స్థిరమైన అభివృద్ధి సాధించే విధంగానూ మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్రిటెక్ ద్వారా టెక్నాలజీని అనుసంధానం చెయ్యడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాం
టెక్ మహేంద్ర వ్యవసాయానికి సంబంధించి అనేక నూతన ఆవిష్కరణలు చేస్తుంది.వ్యవసాయ రంగం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తో కలిసి పనిచెయ్యాలి
భూసార పరీక్షల కోసం సెన్సార్ల ఏర్పాటు లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచెయ్యాలి
మంత్రి నారా లోకేష్
విశాఖపట్నం టెక్ మహేంద్ర సెంటర్ లో కార్యకలాపాలను మరింతగా పెంచబోతున్నాం,మరిన్ని ఉద్యోగాలు కూడా కల్పించబోతున్నాం అని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లిన టెక్ మహేంద్ర ప్రతినిధులు
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటి) స్కూల్ ను త్వరలో విశాఖపట్నం లో ఏర్పాటు చెయ్యబోతున్నాంవ్యవసాయ రంగం అభివృద్ధి కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తో కలిసి పని చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాం
విశాఖపట్నం లో జరిగే అగ్రిటెక్ సమ్మిట్ లో భాగస్వామ్యం అవుతాం అని మంత్రి నారా లోకేష్ కు తెలిపిన టెక్ మహేంద్ర ప్రతినిధులు