VIZAGVISION: Vizag police Arrested by Rajesthan police,Visakhapatnam..విశాఖలోని మధురవాడలో ఆగస్టులో జరిగిన భారీ దోపీడిలో రివకవరీ కోసం వెళ్లిన విశాఖపోలీసులు రాజస్ధాన్ లో పరువుపోగొట్టుకున్నారు….అప్పట్లో బంగారం షాపు యాజమానిని దుండగులు ఇంట్లో కుర్చీకి తాళ్లతో బంధించి 3 కేజీల బంగారాన్ని దోచుకొని కేసునిమిత్తం రాజస్ధాన్ లోని జోధ్ పూర్ వెళ్లారు. అయితే రాకేష్ అనే నిందితుడ్ని గుర్తించి అతడ్ని కేసు నుంచి తప్పించేందుకు అతడితో బేరసారాలకు దిగారు…రెండు లక్షలు ఇస్తే కేసు నుంచి తప్పిస్తామని చెప్పారు..సదరు నిందితుడు అతడు లక్షా 40వేల రూపాయిలు ఇచ్చినట్లే ఇచ్చి ఏసీబీ అధికారులకు పట్టించాడు…దీతో విశాఖ పరువు జోధ్ పూర్లో తాకట్టుపెట్టారు పోలీసులు. విశాఖ నార్త్ డివిజన్ సీఐ పివిఆర్కే చౌదరి, పరవాడ ఎస్ ఐ షరీఫ్, మహారాణిపేట ఎస్.ఐ.గోవిందరావు, కానిస్టేబుల్ ఎస్.హరిప్రసాద్ లు వున్నారు…. దొంగల్లాగ కూర్చున ఫోటోలు జోధ్ పూర్ పోలీసులు విడుదల చేయడంతో విశాఖలో ఈ ఘటన పోలిస్ వ్యవస్థలో కలకలం రేపుతుంది.