చేసేది గౌరవమైన ఉద్యోగం. సినిమా ప్రపంచంతో బాగా పరిచయం. ఉద్యోగం చేస్తున్న సంస్థ కుండే ఇమేజ్ ని బాగా వాడు కోవడం తెలిసిన ప్రసాద్ ఐమాక్స్ మేనేజర్ వెంకట ప్రసాద్ సినిమా లలో చిన్న చిన్న వేషాలు వేయడం తో పాటు, బాహుబలి లో ప్రభాస్ (శివుడు) తండ్రి పాత్ర ను దక్కించుకున్నాడు. ఈ పాత్రలతో పాటు తన సహద్యోగి (33) జీవితంలో విలన్ వేషం వేసాడు. భర్త కు దూరం అయిన ఆమె పై కన్ను వేసాడు.
ప్రేమ పేరుతో దగ్గర అయ్యి ఏడు ఏళ్ళు సహా జీవనం పేరుతో సరదాలు తీర్చు కున్నాడు. తీరా ఆ యువతి కి విడాకులు మంజూరు అయ్యాక, పెళ్లి పై ఒత్తిడి తెస్తే వదిలించుకోవలని చూసాడు. దీంతో ఆ యువతి బంజారాహిల్స్ పోలీసుల కు పిర్యాదు చేసింది. తను పని చేసే సంస్థ పేరు చెప్పుకోని సినిమాలలో వేషాలు రాబట్టే మేనేజర్ వెంకట్ ఆ యువతి కి రెండు సార్లు అబార్షన్ చేయించాడు. ఆమె ను విడాకుల తర్వాత పెళ్లి చేసుకుంటానని మభ్య పెట్టి తన అవసరాలు తీర్చు కున్నాడు. పెళ్ళి పై ఒత్తిడి తెచ్చిన ఆ మహిళ ఆరా తీయగా అతను మరో మహిళ తో తిరుగుతున్నాడ ని తెలిసింది. తన లాగా మరెవరూ వెంకట్ మాయ లో పడకూడదనే ఆలోచన తో పోలీసులకు పిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది.
వెంకట్ ప్రసాద్ వ్యవహార శైలి పై ప్రసాద్ ఐమాక్స్ యాజమాన్యం చాలా ఆగ్రహం గా ఉంది.