VIZAGVISION;Sri Samalingeswara Temple lingalathrigudu Sabavaram,Visakhapatnam..భక్తులు కోరిన కోర్కెలు తీర్చే పుణ్యధామం….అతిప్రాచీన ఆలయం… ద్వాపరయుగంలో ధర్మరాజుచే పూజులు అందుకున్న పుణ్యప్రదేశం స్వయుంభు శ్రీసోమలింగేశ్వరస్వామి ఆలయం… విశాఖజిల్లా సబ్బవరం మండలం లింగాలతిరుగుడు గ్రామంలో స్వయుంభు సోమలింగేశ్వరస్వామివారు భక్తులచే విశేషపూజులను అందుకుంటూ తమకరణ కటాక్షవీక్షణలతో అనుగ్రహసిస్తున్న క్షేత్రం….ఈ క్షేత్రం మహత్యం స్ధలవిశేషాలను వైజాగ్ విజన్ వెబ్ చానల్ ద్వార తెలుసుకుందాం
విశాఖజిల్లాలో గల పుణ్యక్షేత్రాలలో స్వయుంభు శ్రీసోమలింగేశ్వరస్వామి ఆలయం ప్రకృతి ఒడిలో ఎత్తయిన కొండపై కొలువున్న పుణ్యప్రధేశం ఈ దేవాలయం…పూర్వం ద్వాపరయుగంలో ధర్మరాజు పూజించినట్లు ప్రతీతి అయితే ఈ స్వయుంబు లింగం కాలగర్భంలో కలసిపోగా…తిరిగి దశబ్ధకాలం క్రితం ఈ లింగం తిరిగి వెలుగులోకి వచ్చింది…..స్వామివారు ఒక్క చిన్నగుట్టపై వెలసి ఇక్కడ రాళ్లులింగాల రూపంలో లభిస్తూఉండేవి. వీటిని పూర్వం కాలం నుండి తెలుసుకోలేని భక్తులు పారవేయడం , సాలిగ్రామరూపంలో పూజులుకోసం పట్టికెల్లడం ద్వార గుట్ట తరుగుతూ వచ్చింది. ఈ గుట్ట ఏత్తు ఈవిధంగా తరిగిపోవడం గమనించిన గ్రామపెద్దలు త్రవ్వకాలు ప్రారంభించగా సుమారు ఇరవైఐదు అడుగుల లోతుగల ఏకశిల బయటపడింది.ఈ విధంగా బయటపడిన లింగం కదులుతు ఉండేది.కాని స్ధానభ్రంశం చేయుటకు వీలుగా వుండేదికాదు , అందుచే రాళ్ల రూపంలో దోరికే ఈ గుట్టపై ఉన్న లింగాలను భూస్ధాపితం చేయడం జరిగింది.అయితే గ్రామస్ధులు అంతా ఈ లింగాన్ని వదలి వాళ్ళ ఇంటికి చేరుకోని మరుసటిరోజు వచ్చి చూస్తే స్వామివారి మహత్యం కారణంగా లింగంతిరిగి ఉండడాన్ని గ్రామస్ధులు గమనించాగ నాటి నుండి ఆగ్రామనికి లింగాలతిరుగుడు గా పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది.కాలక్రమంలో చుట్టుప్రక్కల గ్రామలలో వర్షాలు లేకపోవడం ప్రజలు తీవ్రదుర్భిక్ష సంక్షోభం ఏదుర్కుంటున్న సమయంలో స్వామివారి సన్నిదిలో పాయసం వండి గుట్టపై పోయగా స్వామివారి మహత్యంతో ఆరోజు సాయత్రం వర్షం సమృద్దిగా పడి ప్రజలఇక్కట్లు తోలిగిపోయాయి.నాటి మొదలు నేటికి ఈ గుట్టపై పాయసం పోయడం అనవాయితిగా వస్తుంది. అలాగే ప్రతినిత్యం స్వామివారిని సూర్యకిరణాలు సృశిస్తాయి. ఈ ఆలయంలో ఉపాయలుగా గణపతి , పార్వతిదేవి , నాగులకట్ట , నవగ్రహమండపం, ద్వారపాలకులగా శృంగి , బృంగి… ఆలయాలను దర్శించవచ్చును.అలాగే ఏత్తయిన ద్వజస్ధంబం రాతిమెట్లమార్గం వీక్షీంచవచ్చు.ఈ ఆలయంలో నిత్యకైంకర్యాలతో పాటు ప్రతినెలవచ్చే మాసశివరాత్రి , కార్తీకమాసం , వార్షికమహోత్సవాలు , శివరాత్రి మరియు విశేషపర్వదినాలలో భక్తుల సంఖ్య అధికసంఖ్యలో భక్తులు వచ్చి ధీపారదానలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు.