VIZAGVISION:78 kg of cannabis catches Pendurthi police,Visakhapatnam… విశాఖ జిల్లా పెందుర్తి మండలం ఎస్ ఆర్ పురంలో సుమారు 78 కేజీల గంజాయిని, ముగ్గురు వ్యక్తులను ఒక ఆటో ని పెందుర్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి పెందుర్తి పోలీసుస్టేషన్లలో ఏర్పటుచేసిన మీడియా సమావేశంలో సీఐ మురళి తెలిపిన వివరాల ప్రకారం నిన్న సాయంత్రం ఎస్ ఆర్ పురం దగ్గర ఉన్న ఒక లే అవుట్ లో ముగ్గురు వ్యక్తులు ఆటోతో ఉండడాన్ని గమనించి వారిని తనికీ చేయగా వారివద్దనుండి 78 కేజీల గంజాయి దొరికిందని దీనితో పాటు బి నాగభూషణ్ పాడేరు, ఎం రాజు జి మాడుగుల, బంగారు రాజేష్ కంచరపాలెం కు చెందిన వీరిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. దీనివిలువ సుమారు నాలుగు లక్షలు ఉంటుందని ఇద్దరు పరారీలో ఉన్నారని వీరిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.