VIZAGVISION:Ivanka Trump Reaches Hyderabad to Attend Global Business Summit,….170 దేశాల నుంచి హైదరాబాద్ కు అతిథులుగా వచ్చిన ఔత్సాహికులు, పారిశ్రామికవేత్తలు… వీరి సంఖ్య దాదాపు 1500. వీరికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రులు, వీఐపీలు అదనం. ఇంతమందికీ నేటి రాత్రి నగరంలోని ఫలక్ నుమా ప్యాలెస్ లో ఘనమైన విందును ప్రభుత్వం ఏర్పాటు చేయగా, సాయంత్రం 5 గంటల తరువాత వీరిని ఫలక్ నుమా ప్యాలెస్ కు ఎలా తరలించాలన్నది పోలీసుల ముందు అతిపెద్ద సవాల్ గా మారింది. 5 గంటలకు తొలి రోజు జీఈఎస్ సదస్సు ముగియనుండగా, ఆపై అతిథులను ఫలక్ నుమా కు తరలించేందుకు 45 బస్సులను ఏర్పాటు చేశారు. తొలుత నరేంద్ర మోదీ కాన్వాయ్, ఆ తరువాత ఇవాంకా కాన్వాయ్, ఆపై కేసీఆర్, కేంద్ర మంత్రుల కాన్వాయ్ లను అనుమతించి, అటు పిమ్మట అతిథులను తీసుకు వెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు