నేడు నౌకాదళ దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్ రోడ్డులోని వార్ మెమోరియల్ వద్ద తూర్పు నౌకాదళ అధిపతి వైస్ అడ్మిరల్ కరం బీర్ సింగ్ నివాళులర్పించారు. అలాగే ఇవాళ సాయంత్రం 4గంటలకు విశాఖ ఆర్కే బీచ్లో నౌకాదళ విన్యాసాలు జరగనున్నాయి. రెండు గంటల పాటు యుద్ధనౌకలు, విమానాలు, హెలికాఫ్టర్లతో మెరైన్ కమాండోలు, నౌకాదళ సిబ్బంది విన్యాసాలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరుకానున్నారు.