తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్ చరణ్ దంపతులు…తిరుమల శ్రీవారిని సినీనటుడు రామ్ చరణ్ దంపతులు దర్శించుకున్నారు. ఆయన వెంట ఆయన భార్య ఉపాసన ఉన్నారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో సతీసమేతంగా స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనార్ధం నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న రామ్ చరణ్ దంపతులకు టిటిడి అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను, పట్టువస్త్రాలను అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని రామ్ చరణ్ తెలిపారు