VIZAG VISION:Heavy Rains Expecting Andhra,visakhapatnam..వేగంగా ప్రయాణిస్తున్న వాయుగుండం ఈ రోజు ఉదయం 8.30కి మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 875 కిలోమీటర్ల దూరాన, గోపాల్ పూర్ కు ఆగ్నేయంగా 870 కిలోమీటర్ల దూరాన కేంద్రీకృతమైంది.ఇది ఉత్తర వాయవ్యంగా పయనిస్తూ ఈనెల 9 ఉదయానికి ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా తీరాలను చేరుతుంది. రానున్న 24 గంటల్లో ఇది తీవ్రవాయుగుండంగా మారుతుంది. తీరానికి చేరేకొలదీ కొద్దిగా బలహీనపడే అవకాశముంది.
దీని ప్రభావంతో శుక్ర శని వారాల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిసా తీరాల్లో భారీ వర్షాలు పడతాయి. తీరప్రాంతాల్లో 60 కిలో మీటర్ల వరకూ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.
మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ అయ్యాయి.