శబరిమల : ఈ ఏడాది శబరిమల ఆదాయం గణనీయంగా పెరిగింది. ఆలయం తెరిచిన మూడు వారాల్లో అంటే డిసెంబర్ 6 నాటికి రూ.83 కోట్ల ఆదాయం అయ్యప్ప ఆలయానికి వచ్చిందని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. ఇదే గత ఏడాది డిసెంబర్ 6 నాటికి అయ్యప్ప ఆదాయం రూ. 70 కోట్లు అని ఆలయ అధికారులు తెలిపారు.
అయ్యప్ప అరవణ ప్రసాదం అమ్మకాల ద్వారా ఇప్పటివరకూ రూ. 36.20 కోట్లు వచ్చాయి. ఇదే గత ఏడాది రూ.30.48 కోట్లు వచ్చాయని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. స్వామివారి హుండీ ద్వారా 29.49 కోట్ల రూపాయాలు రాగా, గత ఏడాది ఇది రూ. 22.80 కోట్లుగా ఉండేది. కేవలం అప్పం ప్రసాదం అమ్మకాల ద్వారా 5.95 కోట్ల రూపాయాలు వచ్చినట్లు ట్రావెన్ కోర్ అధికారులు ప్రకటించారు.