VIZAGVISION:Transformer exploded at VETPSE 7 unit at
Ibrahimpatnam,Vijayawada…అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా ఇబ్రహీంపట్నం vtps లో మరోసారి ప్రమాదం చోటు చేసుకుంది.. కోట్ల రూపాయల విలువచేసే ట్రాన్స్ ఫార్మర్ ఈరోజు అగ్నికి ఆహుతి అయ్యింది.. విద్యుత్ ఉత్పత్తి చేసే7 వ యూనిట్ కి సంబంధించి ట్రాన్స్ ఫార్మర్ లో ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో500 మెగావాట్ల విద్యుత్ కి అంతరాయం ఏర్పడింది. ఆదివారం కావటం.. అక్కడ విధుల్లో ఎవ్వరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. యూనిట్ లో సాంకేతికంగా ఏమైనా లోపం తలెత్తితే సైరన్ మోగాలి.. అలాంటిది సైరన్ మోగిందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది… ఈ ట్రాన్స్ ఫార్మర్ కి సంబంధించి మూడు నెలల క్రితం ప్లీట్స్ మార్చామని అప్పుడే అధికారులు సమస్యను గుర్తించి ఉంటే ఇంతటి నష్టం వాటిల్లేది కాదని ఉద్యోగులు వాపోతున్నారు…