VIZAGVISION:Hello Movie Audio Realised,Visakhapatnam..
విశాఖ నగరానికి సినీ పరిశ్రమ తరలిరావాల్సిన అవసరం ఉందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.
నగరంలో హాలో ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ఆయన మాట్లాడుతూ ‘‘విశాఖ అనేది స్మార్ట్ సిటీ. భారతదేశంలోనే ఒక హ్యాపీనింగ్ ప్లేస్.
అటువంటి స్మార్ట్ సిటీలో ‘హలో’ ఒక స్మార్ట్ ఫంక్షన్.
విశాఖ సినీ ఇండస్ట్రీకి హబ్ కావల్సిన ప్రాంతం ఇది.
షూటింగులకు ఇక్కడ సూటబుల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి.
స్టీల్ ప్లాంట్, పోర్టు లాంటి ఇండస్ట్రీయల్ అట్మాస్పియర్ ఉన్న సిటీ.
గ్రామీణ వాతావరణ కలిగిన రూరల్ ఏరియా. ట్రైబుల్ సంస్కృతి.
ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. గతంలో విశాఖలో షూటింగ్ చేయడం చాలా మంది డైరెక్టర్స్ సెంటిమెంట్‌గా భావించేవారు.
మద్రాస్ నుంచి సినీ ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చేటప్పుడు అక్కినేని నాగేశ్వరరావు ఎలాగైతే కృషి చేశారో, ఇప్పుడు నాగార్జున కూడా అలా చేయాలి.
సినీ ఇండస్ట్రీ తీసుకురావడానికి నాగార్జున ఆధ్యులు కావాలి.
సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహాయసహకారాలు అందిస్తాం’’ అని అన్నారు.